Friday, June 23, 2017


Our trip to Mount Kailash-3
Pokhara local temple visit. Day-3.(07/06/2017).

 We left Jomsom by 8:30 am, returned back to pokhara. Then visited local temples. Gupteswar Mahadev temple is one such surprise, where Lord Shiva is resting in a cave under a small shopping complex. You need to climb down around 350 steps into a cave, it was hot and humid. However, you will love this temple. Very close to this temple you can walk across the road to "Devi's waterfalls. You can google for further details. Then we visited Vindhya vasini a temple complex housing "Radha Krishna", Sita Ram, and "Laxmi Narayan", Ganeshji, Vindhya vasini maata, Lord Shiva, Saraswati maata, Hanumanji. Its on a small hill top, neede climb around 60 steps. Pokhara town view was very beautiful from this temple complex. We also made a visit to a Lake called "Phewa tal" and a small island temple dedicated to Vaarahi maata. You need hire a boat to visit this island temple. After lunch and a brief rest in our Hotel Kanthipura, we went out for a stroll across the road near by, did some shopping. Quite peaceful area, friendly people, shops selling all kinds of winter wear, mostly from Kashmir. Local items were cheap(100 INR-Indian Rupee= 160 NR- Nepali rupee). Temples are not over crowded, no Puja arrangements. You can buy some flowers from local shop keepers, if you wish. One can walk across all temples freely. No special entrance fee. We liked all the temples.

మా కైలాస మానస సరోవర యాత్ర-3

పోఖారా లో దేవాలయాల సందర్శనం -3 (07/06/2017)

జొంసోం నుండి ఉదయం 08:30 గంటలకి బయల్దేరి 09 గంటలకల్లా పోఖారా చేరి వెంటనే దేవాలయాల దర్శనానికి బయలుదేరాము.
ముందుగా గుప్తేశ్వర్ మహాదేవ్ మందిరం దర్శించినాము. చాలా ఆశ్చర్యంగా ఈ  దేవాలయం బోర్డు  ఓ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ బయట ఉన్నది. దేవాలయం షాపింగ్ కాంప్లెక్స్  క్రింద భుమి లోపల గుహలో ఉన్నది.   దాదాపు 350 మెట్లు దిగి లోపలి వెళ్ళాలి. లోపల వేడిగా ఉన్నది. పైకప్పునుండి చిన్న చిన్న చుక్కలుగా నీళ్లు పడుతున్నాయి, అదే ఆ శివునికి అభిషేకం అని తెలిసింది. అక్కడే లోపల ఓ కామధేనువు బొమ్మ విగ్రహం పెట్టి, ఓ పది రూపాయలిస్తే పాలధారతో శివయ్య నెత్తి  పడేటట్లు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే "డేవీ వాటర్ ఫాల్స్" కూడా చూసాము.
ఆ తరవాత ఓ చిన్ని కొండమీద ఉన్న దేవాలయాల సముదాయాన్ని దర్శించినాము. "రాధా కృష్ణ" "సీతా రామ", "లక్ష్మి నారాయణులని " , వింధ్యా వాసిని తల్లిని , శివయ్యని, గణపతిని, సరస్వతీమాతని, హనుమయ్యని కూడా దర్శించుకున్నాము. ఆ కొండమీదనుండి పోఖారా గ్రామం చాలా బాగా కనపడుతుంది.
ఆ తరవాత ఓ పడవనెక్కి,  "ఫెవా సరస్సులో" ఓ చిన్ని దస్విపంలో  వెలిసిన వారాహి అమ్మని కూడా దర్శించుకున్నాము.
మధ్యాహ్నం భోజన విరామం తరవాత ( మా హోటల్ కాంతిపురాలో )కాస్తంత విశ్ర మించి సాయంత్రం దగ్గరలోని బజారుకెళ్లినాము. అన్ని మన కాశ్మిరు దేశపు ఉన్నిదుస్తులు, ఇంకా నేపాలీ దుస్తులు. నేపాలీ దుస్తులు చవకే, కాశ్మిరు దుస్తులు కాస్త  ప్రియం.
 మనదేశపు 100 రూపాయలిస్తే నేపాలీ వారి 160 రూపాయలు వస్తాయి. మా మిత్రులు కొందరు పాదాలు మసాజ్ చేయించుకున్నారు. కొందరు బాడీ మాసేజ్ చేయించుకున్నారు.
ఆ( అన్నట్లు చెప్పడం మరిచాను, మా (కాంతిపుర)హోటల్లో ఫ్రీ వైఫై... అంతా ఎగిరి గంతేసి వారి వారి మిత్రులతో బంధువులతో వెంటనే వీడియో చాట్టింగ్ చేసేసారు (దోమలు పీకుతున్నా పట్టించుకో కుండా).

మరో విషయం ముక్తినాధ్ వెళ్ళకమునుపు  పోఖారాలో హోటల్లో మా బ్యాగులు సర్దుయకుని,కొంత  సామాను అక్కడి హోటల్లోనే విడిచి,   మాచేతి  బ్యాగులలో  అతికొంచెం బట్టలతో మాత్రమే ముక్తినాధ్ వెళ్ళాము.  విమానంలో 5/6 కిలోల కంటే ఎక్కువ బ్యాగేజి అనుమతించరు. చాలా చిన్న విమానాలు, వాతావరణం మీద ఆధారపడి తిరుగుతాయని నిన్నటి యాత్రా విశేషాల్లో చెప్పాను కదా.

మరి రేపు ఉదయం మా ప్రయాణం కాట్మాండు వరకు.
సశేషం.

ఓం నమః శివాయః
భవదీయుడు
మీ లంకా శివ రామ కృష్ణ శాస్త్రి.