Saturday, June 25, 2022

కరోనాయను హాలాహలోపాఖ్యానము

కరోనాయను హాలాహలోపాఖ్యానము

పూర్వం దేవదానవులు మరణాన్ని జయించడానికి  అమృతపానము మేలని దాని కోసరం క్షీరసాగర మధనం చేశారు. ఆకథ మీకు తెలుసినదే. దానిని స్పూర్తిగా తీసుకొని వ్రాసిన వృత్తాంతము. ఎవ్వరిని నొప్పించాలని కానీ ఎవ్వరిని కించపరచాలని కానీ నాకు లేదు. సరదాగా తీసుకోవాలని విన్నపముతో. 🙏🙏

@@@@@@@@@@@

ఈ కలియుగం లో మానవులు

ఈ భూమి 🌎🌍🌏 మీద చిరకాలం నివసించాలని మరణాన్ని కష్టాలను  జయించాలని పరిపరి విధాల ఆలోచించి ఆలోచించి🤔 తపించి  ఈ మరణాన్ని జయించాలన్నా తమకు కలిగే రకరకాల కష్టాలు తొలగాలన్నా సుఖంగా ఉండాలన్నా తమకు ₹₹₹₹ *ధనసంపాదనమే* దిక్కని, *ధనమూలం మిదం జగత్తని* 

యోచించి బీదా బిక్కీ అనే తేడాలేక ధనిక 🇧🇸 పేద దేశాలనే తేడాలేక 🇦🇽🏴‍☠️ ప్రపంచమంతా ఏకతాటిపై నిలచి *కష్టాలనే* సముద్రాన్ని చిలకడానికి తయారయ్యారు. దానికి *స్వార్థమనే*🌋⛰️🏔️ పర్వతాన్ని ఎంచుకొని *మోసమ* నే సర్పాన్ని🐍🐍 చుట్టి చిలకడం ప్రారంభించారు. కలిపురుషుడు కూడా ఈ *భారాన్ని* తన వీపు   మోయడానికి ముందుకొచ్చాడు. 

ఈ మహత్కార్యంలో దేవతలెవరో 😇 దానవులెవరో👺👺 అనే సందేహము వలదు. ఇదే

ధర్మ మార్గంమని చాటుకుని పూజలు, జపాలు, వ్రతాలు, ప్రార్థనలు నోములూ, హోమాలూ వగైరా వగైరా  చేసి (దేవతలు) ధనార్జన చేసే వారొకప్రక్కా, మోసాలూ, ద్వేషాలు, కల్తీలూ, మారణహోమాలు చేసే (దానవులు) మరో ప్రక్కా ఉన్నారు.


అలా చిలకగా చిలకగా మొదట్లో *ఉద్యోగా* లొచ్చాయి, *వ్యాపారా* లొచ్చాయి, రకరకాల *మోసాలొచ్చాయి*  కొందరవీ కొందరివీ పంచుకున్నారు.


 *ఇదంతా విస్మయంగా చూస్తున్నాడు సర్వాంతర్యామి అయిన ఆ శ్రీ హరి.*😕😕😕☹️


ఇంకా చిలకగా ధనసంపాదనకు రకరకాల దారులు గోచరమయ్యాయి మానవులకు.


*పాలల్లో నీళ్ళు కలపొచ్చని*

*బియ్యంలో రాళ్ళు కలపొచ్చని*  


*కల్తీ/ నాసిరకం సరుకులు, మందులు*తయారు చేయొచ్చని,*


 *షేరుమార్కెట్లు పెట్టి జనాల ఆస్తులు క్షణాల్లో కొల్లగొట్టచ్చనీ*


*ఖర్చు తగ్గించుకొని* *ఆదాయాన్ని పెంచడానికి* మామూలుగా దొరికే కోళ్ళు🐓🐓, 🐰🐰కుందేళ్ళూ 🐟🐠 చేపలే 🦙🐑 మేకలూ గొర్రెలే  కాక

🐸🐸 కప్పల్ని,🐛 వాన పాముల్ని, 🐍 పాముల్ని, గబ్బిలాయిలని,🦇🦇 తేళ్ళని🦂🦂, ఎలకలని 🐀🐁, బొద్దింకలని, రకరకాల క్రిమికీటకాలను🐝🐞 తినొచ్చని కొందరు తేల్చారు.


కం.

*గబ్బిలము కప్ప తేళుల*

*సుబ్బరముగ తిన్నవాని చోద్యము గనరే!*

*యబ్బుర మాయెను జగతికి*

*యబ్బాబ్బా యీకరోన నంటించనయా*


ఏవేవో ఇలాటివే రకరకాల దారులు ధరార్జనకై తెరుచుకున్నాయి. 

ఇదే అదనుగా *కలి పురుషుడు* విజృంభించి తనూ తన ప్రభావాన్ని ప్రతాపాన్ని చూపించి ప్రజలకు ఆదాయమార్గాలు చూపించాడు.


కం.

*అప్పుడమిపైన నప్పటి*

*కప్పుడు గిరి కష్టములను క్రమ్మగ ద్రిప్పన్!*

*చప్పుడునిండె నజాండము*

*చెప్పెడిదే మజుని చెవులు చిందర గొనియెన్!*


ఇలా కష్టాలనే పర్వతాన్ని చిలుకుతుంటే ఆ బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగి చెవులు చిల్లులు పడ్డాయట....🥵



ఆ చిలకడమనే మహత్కార్యంలో  కష్టములనే గిరిని తన వీపుపై మోసిన కలిపురుషుని తీటకూడా తీరలేదట!!


కం.

*ఈలీల కష్టముల నవ*

*లీలగ జిలుకె సురలసుర లేర్పడ గనుమా!*

*కోలా హలమై చివరకు*

*హాలా హలమను కరోన హాయిగ బుట్టెన్!!*


అలా చిలుకగా చిలుకగా చివరకు *కరోనా 🦑🐙 అనే మహమ్మారి హాలాహలమై* పుట్టి జడలు విదిల్చి  నాల్కలు జాపి వారూ వీరని, తప పర, ధనిక👨‍✈️ పేద, రాజు రైతు 💂‍♂️ అనే తేడాలేక అందరిని చప్పరించ సాగింది. 

దాని దెబ్బకు జగతి విలవిల లాడింది. చక్రాలాగిపోయాయి. ఫాక్టరీలాగి పోయాలి, 🚂🛤️🛣️రైళ్ళూ🚝🚉🚊 బస్సులూ,🚎🚌, కార్లూ, 🚙🚕🚗 విమానాలు✈️🛫🛩️ పరుగులాపు ఎక్కడి వక్కడ నిల్చిపోయాయి. 


వీధి చివర చిన్న చిన్న  దుకాణాల దగ్గర్నుంచి పెద్ద షాపులు, మాల్సు, 🏣🏬🏥🏢 సినిమా హాళ్ళూ , పెట్రోలు బంకులు,⛽  పార్కులు క్లబ్బులూ పబ్బులూ టపటపా మూతబడ్డాయి. 


నరేంద్రుడు నివ్వెరబోయి స్వీయ  గృహనిర్భంధం ప్రకటించాడు.  అయినా కొందరాతతాయిలు తప్పించు కున్నారు. 🏃🏼‍♀️🏃🏼‍♂️  కోరి కోరి కరోనా నంటించు కుంటున్నారు. 


కం

రంజన చెడి మానవులే

కుంజరయూధమున దోమ కుత్తుక భంగిన్

పంజరమున బందీలుగ

గింజుక చచ్చిరి కరోన గిల్లుట వలనన్!!


దేశదేశాల్లో ఆ మహమ్మారి ధాటికి జనులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రజలు కనుభవమైన సునామీలు🔥💫 తూఫాన్లు, భూకంపాలూ, ప్లేగులు దీని ధాటికి దిగతుడుపే.  రోజురోజుకి దాని తీవ్రత ఎక్కువైనది.💥


అలాటి విపత్కర సమయంలో *అచ్యుతానంత గోవిందా* యని కొందరూ, *రుద్ర సూక్తాలను* కొందరూ, *మన్యుసూక్తాలను* మరికొందరూ, *క్రిమిసంహారక* సూక్తాలను కొందరూ, ఇలా ఎవరికి తోచిన పరిహారాలను వారి పఠిస్తూ స్మరిస్తూ, వెల్లుల్లి, లవంగాలు, తులసి, తిప్పతీగలను, సొంఠి, మురియాలు లాటి రకరకాల గృహౌషధాలను, కషాయాలను టన్నులు టన్నుల క్రొద్దీ మింగుతూ 😄😄 ఉండగా, ఆఁ ఈ కరోనా మనల్నేం చేస్తుంది మన *మందు మనకుందిగా*🍺🍻🍯🥂🍷🥃   అని కొందరు ఘనులు సీసాలు సీసాలు, పీపాలు పీపాలు లాగిస్తున్నారు. 


నాబోటి వారు ఎందుకైనా మంచిదని కందయాగం చేస్తున్నారు. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.


కం.

*హాలాహలమే మ్రింగితి*

*కాలుని దన్నితి పరేశ గరుణా సింధో!*

*ఏలా యుపేక్ష శివ శివ*

*లీలగ రావయ కరోన రిక్తము జేయన్!*




*_మరి ఆదేవుళ్ళేమి చేస్తున్నారో....?_*

మొత్తం మానవజాతి యావత్తూ ఇలా పిట్టల్లా రాలిపోతుంటే!! గుడులు గోపురాలన్నీ మూసేశారు. 


కం.

*ఎక్కడి దేవుళ్ళక్కడె*

*చక్కగ సేవల సుఖముల చాలని యనరే!*

*దక్కెను కరోన మాకిల*

*చక్కెర పొంగలి తినెదరు చక్కగ వారున్!!*



ఈ కరోనా బారిన పడకుండా

కొందరు మాస్కులు తగిలించుకుంటున్నారు 😷😷

 దండకాలు వ్రాస్తున్నారు

 🙏దండాలు పెడుతున్నారు. 🙇🏼‍♀️🙇‍♂️, దస్కీలు తీస్తున్నారు💪💪, యోగా చేస్తున్నారు

🧎🏻🧎‍♀️.



ఎవరికి తోచిన రీతిన వారు కరోనా మహమ్మారిని ఎదుర్కినడానికి సన్నధ్ధమౌతున్నారు.



కం.

ఎవ్వరు జేసిన కర్మము

నవ్వారిని విడువదనుచు నందరు తలపన్!

అవ్వల నివ్వల జచ్చిరి

కవ్వము లాగా చిలికెను కాళి కరోనా!!


అలా దేవదానవుల రూపులైన మనుజులు చిలుకగా చిలుకగా పుట్టిన కరోనా 🐲🐲  యనే హాలాహలాన్ని  అవలీలగా కట్టడి చేయగ దానిని గృహనిర్భంధం చేసి మోడీ (ళీ)చేసి తన గొంతులో నిలుపుకున్నాడా నరేంద్రుడు.


కం.

పట్టిన పట్టుని విడువడు

గట్టిగ చెప్పెను జనులకు కదల వలదనెన్!

రట్టడి నాపెను చివరకు

కట్టడి చేయగ కరోన ఖైదై పోయెన్! 



పూర్తిగా ఈ కరోనా మాయమవలేదు. తాత్కాలిక కట్టడి మాత్రమే జరిగిందట. 



మరి అలనాడు పాలకడలి చిలికితే హాలాహలమే కాక ఉచ్చైశ్రవము , అప్సరసలు, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు,  లక్ష్మీదేవి ఇలా చాలా పుట్టుకొచ్చాయి. 


మరిప్పుడేం జరిగింది?? ఇలా కరోనా కట్టడి వల్ల ప్రజలకు కిన్ని మేళ్ళు కూడా కలిగాయట. 


కం.

కలిసుండిన కలదు సుఖము

బలుసాకైనా బ్రతుకుకు బాగు కరోనా!

మెలమెల్లగ బుధ్ధి గలిగె

మెలకువ కలిగించె నిట్లు మేటి కరోనా!!


కలిసిమెలసి ఉంటే సుఖమని కొందరు కనుగొన్నారు. ☺️☺️


కం.

తెలతెల వారగ పక్షుల

కిలకిల రావముల వల్ల కీడే తొలగెన్!

విలవిల లాడిరి కొందరె

గలగల మాట్లాడిరంత గనవెకరోనా!!


కొందరుదయాన్నే నిద్రలేచి పక్షుల 🦜🦚🕊️ కిలకిలలు విన్నారట దానివల్ల కొంత కీడు తగ్గిందట. కొంతమంది గృహ నిర్భంధం వల్ల ఇబ్బంది పడినా  పాత మిత్రులతోటి, బంధువులతోటి ఫోన్లో గలగలా మాట్లాడారట చాలామంది. 


అంతేనా అప్పుడు 🦄🦄ఉచ్చైశ్రవము పుడితే ఇప్పుడు కొందరు తమ తమ వాహనాలమ్మేసి  🐴 గుర్రాలు ఎడ్లబండ్లు కొనుక్కున్నారట.

 కొందరేమో ఆరోగ్యానికి,😜 

  మేలని 🚶🏻‍♂️🚶🏼‍♀️ నడక, పరుగు, 🏃🏼‍♂️🏃🏼‍♀️‍ జాగింగ్ లాటివి ప్రారంభించారట. 


కం.

వాహనముల రొద తగ్గెన్

సాహసములు జేసి కాలు సాగించె నరుల్!

ఆహా మేలని గుర్రపు

వాహనములనెక్కినారు వారుకరోనా!!


మరి అప్పుడు అప్సరసలు పుట్టారుగా మరిప్పుడు??


కం.

మిలమిల మెరిసెడి కన్నులు

తళతళ లాడెడి కురులును తమకము నింపన్!

కలలా గడచెను కాలం

బిలలో తనసతియె చాల యింపు కరోనా!



ఇన్నాళ్ళు ఎక్కడ దాచావోయ్ ఇంతటి 💋👄💁‍♀️ అందమని తమ తమ ఇంతుల అందాలని కనుగొన్నారట చాలామంది పురుషపుంగవులు. 😇🤪.


అంతేనా...😁😁😁


పనిగట్టుకు పగబట్టెను

కనిపించదు యీ కరోన కష్టమ్ బెట్టెన్

వనితల కష్టము పెరిగెను

తిని పెంచిన *వారి* బొర్ర తిప్పలు పెరిగెన్!!


ఇంటిపట్టున ఉండి రుచులు రుచులుగా వండివారిస్తే బొర్రలు పెరిగాయి మొర్రో అనికొందరు, సరుకులు కరిగి పోతున్నాయని బాబోయని కొందరు భార్యలు ఏడ్చారు. 


కం.

పగలంతయు పని చేసెను

వగలన్నియు రాత్రి వేళ వన్నెలు జూపెన్!

మిగిలెను కరోన కర్చని

నగలను చేయించ మంచు నాసతి దెలిపెన్!!


బైట తిరుగుళ్ళు ఖర్చులు చాలా మిగిలు...మీర నాకు నగలు చేయిస్తే మీకు మేలు అని కొందరు పతివ్రతలు వగలొలకపోస్తూ  వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. 

😜🤪


ఇలా ఎవరింట్లో వారుంటే..


కం.

ఎవరింటిన వారుండగ

ఎవరంట్లనువారె త్రోమ నేమి కరోనా!

చివరకు సడలెను కర్ఫ్యూ

నవసర మయినంత నేర్పె నయ్యొ కరోనా!!


ఇలా చాలా చాలా (సుఖమైన సంసారానికి సులభ సూత్రాలను) అవసరమైనప్పుడు విషయాలు నేర్చుకున్నారు కొందరు. 😂😂




సరేనండీ... మరి అప్పుడు లక్ష్మీదేవి పుట్టింది కదా మరిప్పటి సంగతేమిటీ అన్నారు కొందరు.??


కం.

పెద్దమ్మ బుట్టె చివరకు

పెద్దన్న వణక గడగడ పెరిగెకరోనా!

సుద్దులను విన్న వారల

వద్దకు వెళ్ళదట మేలు వగచెకరోనా!!


ఇప్పుడు లక్ష్మీదేవి అక్కగారు ముందుపుట్టారట. దాని ధాటికి అమెరికా పెద్దన్న కూడా విలవిల లాడాడట. 🥶😭😤🤯. మంచి మాటలు (సుద్దులు)వినే వారిని విడచి మిగతావారిని చప్పరించడం మిదలెట్టిందా భూతం. 🤣🤣😂😂


కం.

ఆర్థిక మాంద్యము బుట్ట స

మర్ధించెడు వారులేక మరిగె కరోనా!

వ్యర్థములై బ్రతుకు మన

స్పర్థలు పెరిగెను చివరకు శాంతియె తొలగెన్!


చివరకు ఆర్థిక మాంద్యము పట్టింది జగతికి. 😞😞☹️🙁😕😟.


మరి లక్ష్మీదేవి సంగతేం జేశారు అని అడిగారుగా... ఆవిడా పుట్టింది.


కం.

దానము ధర్మము చేయుచు

మానవులనిపించు కొన్న మాసెకరోనా!

మానవ సేవయె మేలని

మానక చేసిన మనుజుల మధ్యన నిలచెన్!


ఆవిడ అలా జన్మించి మంచి మానవుల గుండెల్లో పెరిగింది. మానవసేవయే మాధవసేవ అని నిస్వార్థంగా సేవ చేసే వారి హృదయాల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నది. అలా లక్ష్మీదేవి తన మాధవుడిని చేపట్టింది. ☺️☺️🤘.


మరి ముందు ముందు ఏం జరగబోతున్నది?? అదేనండీ కరోనా లాక్డౌన్ తొలగించిన తరవాత ఏం జరుగుతుంది.??



పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు, వెళ్ళాలా లేదా??


కం

పెళ్ళిళ్ళకు పోవలెనే

కళ్ళెము వేసెను కరోన కష్టము వచ్చెన్

వెళ్ళాలో లేదోమరి

పెళ్ళాలే చెప్పగలరు ప్రేమము మీరన్!


కం.

పేరంటాలకు బోవన్

క్వారంటైనా కరోన కాలము గనుకన్!

మీరెంతైనా చెప్పుడు

వారింతైనా వినరు నివారింప వలెన్!!


కం.

సినిమా హాళ్ళకు పోనిక

కనిపించిన చోట్లకెల్ల కాళ్ళరిగేలా

పనిలేకుండగ తిరుగను

మనిషిగ మిగిలెద కరోన మాయను గెల్తున్!!


ఈ విధంగా ధనార్జన పరమావధి కాదని జనార్ధనుని తలచడమే మేలని కొందరు తెలుసుకున్నారు.  చాలా మంది నేర్చుకున్నట్లు లేదు. 


🙏🙏



భవదీయుడు,

శ్రీ లంక శివరామకృష్ణ శాస్త్రి.

9701367992.

LSRK SASTRY

No comments:

Post a Comment